ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం ములుగు జిల్లాకు చేరుకున్నారు. గవర్నర్ రోడ్ మార్గంలో ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకోగానే గవర్నర్ కు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పూల మొక్కతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి చేరుకుని, అక్కడి ప్రజలతో ముచ్చటిస్తారు. అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంకు చేరుకొని తల్లులను దర్శించుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, ఐటీడీఏ పీ.ఓ చిత్రా మిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, తదితరులు ఉన్నారు.