శాంతి భద్రతలే లక్ష్యం

  • మహిళా రక్షణే ధ్యేయం
  • సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
  • ముందు జిల్లాలో పర్యటిస్తా
  • ఆ తరువాతే ప్రణాళిక
  • శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేదు. నేరస్థుల కట్టడే లక్ష్యం. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి(A special focus) పెడతా. ముందు జిల్లాలో పర్యటిస్తా. ఒక ప్రణాళిక తయారు చేస్తా. జిల్లాలో శాంతి భద్రతలే ప్రధాన లక్ష్యం, అని శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) నూతన ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు.

ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానంగా శాంతి భద్రతలు, మహిళా రక్షణ(Protection of women), సైబర్ నేరాల పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

ముందుగా జిల్లాలోని ఆయా ప్రాంతాలలో పర్యటించి, అనంతరం ఒక ప్రణాళికా బద్ధంగా అవసరమైన చర్యలను చేపడుతామన్నారు. ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ప్రజల సహకారంతో(with the support of the people) అదేవిధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని, జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావటానికి కృషి చేస్తామన్నారు.

జిల్లాలో మహిళలపై జరుగుతున్నఅఘాయిత్యాలకు సంబంధించి, ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అంతేకాకుండా అలాంటి సంఘటనలు(incidents) చోటు చేసుకోకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి, ఆ మేరకు పటిష్టమైన చర్యలకు కృషి చేస్తానని జిల్లా ఎస్ పీ సతీష్ కుమార్ అన్నారు.

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు(cybercrimes) బాగా పెరిగాయని, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సైబర్ బాధితులు తగ్గే రీతిలో పోలీసులను, ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు. రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించి, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్నఘటనలపై ప్రత్యేక దృష్టి పెడతామని, భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామన్నారు.

Leave a Reply