కోదాడ, ఆంధ్రప్రభ : విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు పట్టుదలతో చదివి మంచిమార్కులు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ ( Collector) తేజస్ నందలాల్ పవార్ (Tejas Nandalal Pawar) ఆకాక్షించారు. ఈరోజు కోదాడ మండలం నల్లబండ గూడెం (Nallabanda gudem) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పదో తరగతిలో జరుగుతున్న మ్యాథ్స్ సబ్జెక్టు నోట్ బుక్ ల (Maths subject notebooks) ను పరిశీలించారు. ప్రధానంగా చేతిరాత బాగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి మార్కులు వస్తాయని సూచించారు. మీరు భవిష్యత్ లో ఏమి అవ్వాలని ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకొని చుదువుకుంటే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకి తెలియజేసి ప్రోత్సాహించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సూర్యనారాయణ (RDO Suryanarayana), ప్రధాన ఉపాధ్యాయురాలు వసంత, ఉపాధ్యాయురాలు శైలజ, ఆర్ ఐ జగదీష్ తదితరులు ఉన్నారు.

