- కేంద్రం దగా
- రాష్ర్టం మోసం
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆగ్రహం
(ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో) : రైతులను వివిధ రూపాలలో యూరియా, గిట్టుబాటు ధర, పత్తి దిగుమతి లాంటి విషయాలలో అన్ని కోనాలలో మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టండని సిపిఎం (CPM) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం కర్నూలు నగరంలోని కొత్తబష్టాండ్ ఇందిరాగాంధీ నగర్ (Indira Gandhi Nagar) లో ఉన్న సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటి సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి యస్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి మాట్లాడారు.
ఈసందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ… ఢిల్లీ ఎర్రకోట నుండి ఆగస్టు 15న దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మాటల శబ్దం ఆగక ముందే కేంద్ర ఆర్థిక శాఖ రైతుల పై భారాలు వేసే ప్రయత్నం చేసిందని, ఈ మేరకు పత్తిపై దిగుమతి సుఖం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో బాగా పత్తి పండించే జిల్లా కర్నూలు జిల్లా (Kurnool District) అని, దానివల్ల బాగా నష్టపోయే జిల్లా కూడా కర్నూలే అన్నారు.
విదేశాల నుండి దిగుమతయ్యే పత్తిమీద ఉన్న 11శాతం సుంకాన్ని రద్దు చేయడం ద్వారా ఇబ్బడి ముబ్బడిగా పత్తి దిగుమతి అయి, దేశంలోని పత్తి రైతులను నాశనం చేస్తుందన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత (Urea deficiency) కు కేంద్ర రాష్ట్ర పాలకులే కారణమన్నారు. కేంద్రం బడ్జెట్లో ఎరువుల ధరల మీద సబ్సిడీ తగ్గించిందని, దీనివల్ల సబ్సిడీ మీద పెట్టే నిధులు తగ్గిపోతాయన్నారు. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కు ఆశపడి రాష్ట్రం ప్రకృతి వ్యవసాయం పేరుతో ఎరువులు వాడకండి అంటుందని వాడకండి అంటే వినరు కాబట్టి ఎరువులే లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.
అధికార పార్టీ నాయకులే యూరియాను మల్లిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేకచోట్ల రైతుల చేతుల్లో ఉన్న వందల ఎకరాల సాగు భూమి (Cultivated land) ని వివిధ కారణాలు చెప్పి, పరిశ్రమల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు దారా దత్తం చేస్తుందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి అంటూ కేకలు పెట్టిన పాలకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత దేన్నయితే అవినీతి అన్నారో దాన్నే అత్యంత వేగంగా అమలు చేస్తున్నారన్నారు.
నెల్లూరు జిల్లా (Nellore District) కరేడులో 16 వేల జనాభా, 18 గ్రామాలు, 11 వేల ఎకరాల భూమి ఉంటే భూమి నంత ఒక్క శిరిడి సాయి కంపెనీకి అప్పజెప్పారన్నారు. రైతులంతా భూములు కాపాడుకోవడం కోసం పోరాడుతుంటే నిర్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రయోగిస్తుందన్నారు. రైతులందరికీ యూరియా సరఫరా కోసం, గిట్టుబాటు, దిగుమతి సుంకాల ఎత్తివేత, రైతుల భూములు లాక్కోవడానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.
సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు (CPM District Secretariat Members) పి నిర్మల, ఎండి ఆనంద్ బాబు, జి రామకృష్ణ, కె వెంకటేశ్వర్లు, కె.వి నారాయణ, టి రాముడు, ఎండి అంజిబాబు, జిల్లా కమిటీ సభ్యులు రామాంజనేయులు, కె అరుణ, ఎం రాజశేఖర్, విజయ్, లింగన్న, లక్ష్మన్న, నగేష్, గురు శేఖర్, నరసింహ, వీరశేఖర్, హనుమంతు, గోవిందు, మోహన్, నాగన్న తదితరులు పాల్గొన్నారు.