ప్రజలపై ధరల భారాన్ని తగ్గించాలి..

ప్రజలపై ధరల భారాన్ని తగ్గించాలి..
ఆలేరు, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉదాసీనత వల్లే యుద్ధ ప్రభావంతో ధరల గాయాలు ప్రజల్ని బాధిస్తున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ సోమవారం విమర్శించారు. మోడీ యుద్ధం విషయంలో జోక్యం చేసుకోకుండా మీనమేషాలు లెక్కించడం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోయి భారతీయులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని చెప్పారు. బీజేపీ అసమర్థ విధానాల వల్ల యుద్ధ ప్రభావం ప్రజల పై పడి ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు అన్ని రంగాలపై యుద్ధ ప్రభావం పడడం వల్ల సామాన్య ప్రజల జీవితం రోజురోజుకు అధ్వాన్నంగా మారిపోతున్నదని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధ్యమైనంత వరకు యుద్ధ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ జోక్యం చేసుకొని యుద్ధ నివారణ చర్యలకు పూనుకోవాలని చెప్పారు.
