విద్యుత్ లోవోల్టేజీ సమస్యలకు ప్రధాన కారణం అదే..

విద్యుత్ లోవోల్టేజీ సమస్యలకు ప్రధాన కారణం అదే..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఇల్లందు నుండి ఆళ్లపల్లి మండల 33కెవి/లెవెన్ కెవి సబ్ స్టేషన్ సుదూర ప్రాంతం కావడంతో, విద్యుత్ సరఫరాలో పలు గ్రామాల నడుమ ఎక్కువ వోల్టేజ్ మూలాన విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని ఇల్లందు ఇన్చార్జి డిఈ ఇన్ కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ ను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో 2024-2025 వరకు 2100 పైచిలుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరయ్యాయని, 2025-2026లో మండలంలో సుమారు 1600లో సర్వీసులు మంజూరు కావడంతో, మొత్తం 3700 వ్యవసాయ సర్వీసులతో లోవోల్టేజీ సమస్య ఏర్పడుతుందని గుర్తు చేశారు. విద్యుత్ లోవోల్టేజీ సమస్యను అధిగమించేందుకు మండల వ్యాప్తంగా 3.15 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ లను ఏర్పాటు చేసినప్పటికీ, వాటి స్థానంలో అదనంగా 2 ఏంవిఏ,5ఏంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ లను సుమారు 1 కోటి 80 లక్షలు వెచ్చించి అమర్చడం జరిగిందని తెలిపారు.

ఆళ్లపల్లి సబ్ స్టేషన్ కు 70 కిమీ సుదూర ప్రాంతం కావడంతో ఇల్లందు సబ్ స్టేషన్ 132/33కేవి నుండి ఆళ్లపల్లి 33కేవి సబ్ స్టేషన్ విద్యుత్ సరఫరా కావడం జరుగుతుందని గుర్తు చేశారు. లోవోల్టేజీ నివారించేందుకు ఆళ్లపల్లి సబ్ స్టేషన్లో 70 లక్షల వ్యయంతో రెండు 5ఎంవిఏ బూస్టర్ ట్రాన్స్ఫార్మర్లు, 30 లక్షల వ్యయంతో 11కేవి ఫీడర్ల మీద అధిక లోడ్ తగ్గించేందుకు 2 కెపాసిటర్ బ్యాంక్ లను ఏర్పాటు చేశామన్నారు. అదే క్రమంలో 11కేవి లైన్లలో ప్రతి ఫీడర్ కు 3 చొప్పున మొత్తంగా 12 లక్షల వ్యయంతో 600 కెవిఏఆర్ కెపాసిటర్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2026 సంవత్సరంలో మర్కోడులో 33/11కేవి సబ్ స్టేషన్ నూతనంగా మంజూరు చేయడం జరిగిందని, అట్టి నిర్మాణ పనులను ఏప్రిల్ మాసంలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని, దానితో పాటుగా 132/33 కెవి నూతన సబ్ స్టేషన్ కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ జగదీష్, ఉమ్మడి మండలాల సబ్ ఇంజనీర్ నజీర్, స్థానిక లైన్మెన్లు పవన్, శివ, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply