Thammareddy | సంచలన వ్యాఖ్యలు..?

Thammareddy | సంచలన వ్యాఖ్యలు..?

Thammareddy | ఇండస్ట్రీ పెద్ద దిక్కు అంటే దాసరి నారాయణరావే
దాసరి తర్వాత పెద్ద దిక్కు ఎవరు అనే చర్చ
కరోనా సమయంలో చిరంజీవి చేసిన సేవలు
పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరన్న తమ్మారెడ్డి
తమ్మారెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ

Thammareddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటే.. అందరికీ గుర్తొచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావు.(Dasari Narayanrao) ఆయన దగ్గరికి వెళితే ఏ సమస్య అయినా వెంటనే పరిష్కారం అవుతుంది అని ఇండస్ట్రీలో అంటుంటారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అంటే కొంత మంది ఒకలా, మరి కొంత మంది మరోలా చెబుతుంటారు. అయితే.. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ.. తమ్మారెడ్డి ఏమన్నారు..?

Thammareddy

Thammareddy | ఇండస్ట్రీ పెద్ద దిక్కు దాసరి..

ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడంతో దాసరి నారాయణరావును పెద్ద దిక్కుగా గౌరవించేవారు. సినీ కార్మికుల సమస్య అయినా, సినీ నిర్మాతల సమస్య అయినా.. ఆయన సమస్యగా భావించే పరిష్కరించేవారు. అయితే.. ఆయన లేకపోవడంతో ఇండస్ట్రీకి (Industry) పెద్ద దిక్కు ఎవరు అనే ప్రశ్న మొదలైంది. చాలా సార్లు ఈ విషయం గురించి డిబేట్లు జరిగాయి. అయితే.. మెగాస్టార్ చిరంజీవి అనేక సందర్భాల్లో ఇండస్ట్రీ కోసం చొరవ తీసుకుని మంచి పనులు చేశారు. ముఖ్యంగా కరోనా టైమ్ లో సినీ కార్మికుల కోసం ఆలోచించి మెగాస్టార్ చిరంజీవి లీడ్ తీసుకుని మిగిలిన నటీనటులు, నిర్మాతలు, దర్శకుల సాయంతో నిత్యావసర వస్తువులను అందించారు. కష్టకాలంలో ఆపద్భాంధవుడు అయ్యారు.

Thammareddy

Thammareddy | పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు..

చిరంజీవి ఇండస్ట్రీకి సంబంధించి అందరికీ నేనున్నాను అనే భరోసా కలిగించారు. అయితే.. చిరంజీవి ఎంత చేసినా ఆయన్ని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా గుర్తించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అసలు చిరంజీవే ఆయన్ని పెద్ద దిక్కుగా భావించాలి అనుకోవడం లేదు. అప్పుడప్పుడు ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరు అనే టాపిక్ వార్తల్లోకి వస్తుంది. ఇప్పుడు వదలా అనే సినిమా (Movie) ప్రమోషన్స్ లో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజను ఓ జర్నలిస్ట్ ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరు అనే ప్రశ్న అడగడం.. దీనికి తమ్మారెడ్డి.. అసలు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు అంటూ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

Thammareddy

Thammareddy | ఆయన ఒక్కడే.. ఇంకొక్కడు రాడు..

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ పెద్ద అంటూ ఎవ‌రూ లేరు. నిజానికి అది ప‌ద‌వి కాదు. వాళ్లు చేసే ప‌నుల‌ను బ‌ట్టి పెద్ద దిక్కు అవుతారు. ఒకాయ‌న.. తాను చేసిన ప‌నుల వ‌ల్ల ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు అయ్యాడు. ఆయ‌న చేసిన ప‌నుల వ‌ల్ల చాలా మంది ఆయ‌న ద‌గ్గ‌రికి వెళ్లేవాళ్లం. కాబ‌ట్టే ఆయ‌న పెద్ద దిక్కుగా ఉన్నారు. కానీ ఇవాళ ఆయ‌న లేరు కాబ‌ట్టి పెద్ద దిక్కు లేన‌ట్లే. పెద్ద దిక్కు రావడం అనేది జరగదు నాకు తెలిసి.. ఆయ‌న ఒక్క‌డే.. ఇంకొక్క‌డు రాడు ఎప్పుడూ.. లేడు కూడా.. అని త‌మ్మారెడ్డి చెప్పారు. అయితే.. చిరంజీవి (Chiranjeevi) mసినీ కార్మికులకు సమస్య వచ్చినా.. ఇంకా చెప్పాలంటే.. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా.. ముందకు వస్తారు. ఆయన్ని పెద్ద దిక్కుగా భావించకుండా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి.. దీని పై ఇంకెవరైనా స్పందిస్తారేమో చూడాలి.

Thammareddy

Leave a Reply