TG | టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు.. చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
టీజీఎస్‌ఆర్టీసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించిది. ఈ నెల 10వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు చర్చలకు హాజరు కావాలని ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ జేఏసీని ప్రభుత్వం ఆహ్వానించింది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఫిబ్రవరి 9న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని… జనవరి 27న హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆపరేషన్ ఈడీ మునిశేఖర్‌కు సమ్మె నోటీసుతో పాటు 21 డిమాండ్లతో కూడిన పత్రాన్ని కార్మిక సంఘాల నేతలు అందించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించినట్టు కార్మికశాఖ పేర్కొంది.