ఢిల్లీ: తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. జీవో 29పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ జాబితా టీజీపీఎస్సీ విడుదల చేసింది.త్వరలో టీజీపీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనుంది.
కాగా, దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రభుత్వం జీఓ 29ను జారీ చేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్ అయ్యింది.