TG | బ‌న‌క‌చ‌ర్లను ఆపేందుకు ఎందాకైనా పోరాడుతాం.. కెటిఆర్

సీఎం రేవంత్ నిర్ణ‌యం మార‌క‌పోతే మ‌రో ఉద్య‌మం
ఇరిగేష‌న్‌పై రేవంత్‌కు అవ‌గాహ‌న లేదు
గోదావరి జ‌లాల‌పై బీజేపీ వైఖ‌రి చెప్పాలి
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సిరిసిల్ల‌, ఆంధ్ర‌ప్ర‌భ : గోదావరి జలాలపై (godavari water ) కేంద్రంలోని బీజేపీ (bjp ) వైఖరి చెప్పాలని, బ‌న‌క‌చ‌ర్ల‌పై (banakacharla ) పోరాటానికి ఎందాకైనా సిద్ధ‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, (BRS working president ) మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (MLA KTR ) అన్నారు. సిరిసిల్లలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నీళ్లను తీసుకుపోతామంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏపీతో చర్చల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసహరించుకోవాలని, ఒకవేళ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చిరించారు. తెలంగాణలో కోవర్టు పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు.

బీజేపీ వైఖ‌రి చెప్పాలి

గోదావరి జలాలపై బీజేపీ వైఖరి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో స‌మావేశం పెట్టించింది, కమిటీ వేసేది చంద్రబాబేనని, తెలంగాణకు మళ్లీ ద్రోహం చేసేందుకు పెద్ద కుట్రే జరుగుతోందని కామెంట్ చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్లపై పోరాటానికి ఎక్కడి వరకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. నీళ్ల వాటాలు తేలాకే ఏ ప్రాజెక్ట్ చేపట్టాలని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి ఇరిగేషన్ గురించి తెలియదని.. ఆయనకు తెలిసింది రియల్‌ఎస్టేట్, బ్లాక్‌ మెయిల్‌ దందాలేనని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాయలసీమకు కూడా ప్రయోజనం కలగాలనే ఆకాంక్షించారని.. చంద్రబాబులా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కుట్రలు చేయలేదని కేటీఆర్ మండిప‌డ్డారు.

మాకూ ఒక రోజు వస్తుంది — పోలీసులకు కేటీఆర్‌ హెచ్చరిక
మ‌కూ ఒక రోజు వస్తుంద‌ని, పోలీసులకుబ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హెచ‌ర్చించారు. ఈ మేర‌కు ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. | బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌ దుర్గం శశిధర్‌ గౌడ్‌ అలియాస్‌ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఎవరూ అధికారంలో శాశ్వతంగా ఉండరని.. తమకూ ఒక రోజు వస్తుందని తెలంగాణ డీజీపీ జితేందర్‌ను ఆయన హెచ్చరించారు. కొణతం దిలీప్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ ఈ మేరకు కేటీఆర్‌ స్పందించారు.

భ‌యాన‌క ప‌రిస్థితులను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, భయానక పరిస్థితులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్‌ తెలిపారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్‌ను ఉద్దేశించి అన్నారు. అప్పుడు ప్రతి చర్యను సమీక్షిస్తామని ట్వీట్ చేశారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. దీనిపై పోరాడుతూనే ఉంటామని తెలిపారు.

Leave a Reply