దోమలపెంట, ,నాగర్ కర్నూల్ జిల్లా నుండి/ అమ్రాబాద్ – ఆంధ్ర ప్రభ : ఫార్మ్ హౌజ్ లో కూర్చొని పాలన చేసే ప్రభుత్వం మాది కాదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి బి.ఆర్.ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.బి.ఆర్.ఎస్ పాలన తరహాలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మాకు రాదని ఆయన పేర్కొన్నారు.క్షేత్రస్థాయిలో సాధ్యసాధ్యాలను పరిశీలిస్తూ ప్రజాపాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని ఆయన తేల్చిచెప్పారుగురువారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా దోమల. పెంట సమీపంలోని ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారుఈ ఘటనపై మంత్రులు, అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తవుతాయని, టన్నెల్ పనులు మరో రెండు నుంచి మూడు నెలల్లో తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.
సహజ సిద్దంగానే నేను పైలెట్ నని,యుద్ధ విమానాలు న్నదిపిన అపార అనుభవం తనదని బి.ఆర్.ఎస్ నేతల మాదిరిగా విలసాలకోసం హెలికాప్టర్ లో తిరిగే స్వభావం తనది ఎంతమాత్రం కాదన్నారు నాటి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో కుమ్మకై విందులు,వినోదాలు చేసుకుని కృష్ణా జలాశయాలను ఆంద్రప్రదేశ్ కు సంతర్పణం చేసిన చరిత్ర నాటి బి.ఆర్.ఎస్ పాలకులదని ఆయన తీవ్రంగా విమర్శించారు ఇదే ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్ కు విద్యుత్ సరఫరా నిలిపి వేసినప్పుడు విద్యుత్ శాఖా మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి ఎందుకు మిన్నకుండి పోయారని ఆయన విమర్శించారు బి.ఆర్.ఎస్ పాలనలో కేసీఆర్, హరీష్ రావులు నీటిపారుదల రంగాన్ని భ్రష్ఠు పట్టించారని ఆయన దుయ్యబట్టారు.
ఎస్.ఎల్.బి.సి ప్రమాద ఘటనలో హరీష్ రావు విమర్శలు అర్ధరహితమని ఆయన కొట్టి పారేశారు.సంఘటనా స్థలి వద్దకు బి.ఆర్.ఎస్ నేతలు జరిపిన పర్యటన ఆసాంతం రాజకీయ హైడ్రామాయో నని ఆయన మండిపడ్డారు1.81 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కళ్లెదుటే కుప్పకూలి పోయినప్పుడు బి.ఆర్.ఎస్ నేతల గొంతులు ఎందుకు పెగలలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పై 27,500 కోట్లు ఖర్చు పెట్టిన బి.ఆర్.ఎస్ పాలకులు అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు అందించ లేకపోయారన్నారుఈ ఘటనకు పూర్తి బాధ్యత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన ఆరోపించారు.
పదేళ్ల పాటు SLBC ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారని, ముందుగా పూర్తి చేసి ఉంటే 30 టీఎంసీ నీరు తెలంగాణకు అందేలా ఉండేదని, దాదాపు 3-4 లక్షల ఎకరాలకు సాగునీరు లభించేదని ఆయన తెలిపారు.
“బీఆర్ఎస్ నేతలు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా అపహాస్యం చేశారన్నారు. వీరు సమర్థంగా పని చేసి ఉంటే, ఈ ప్రాజెక్ట్ ఏప్పుడో పూర్తయ్యేదని, అప్పుడు తెలంగాణ రైతులకు నీటి కొరత ఉండేది కాదన్నారు. హరీశ్ రావు విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. అతని సలహాలు అవసరం లేదని అన్నారు.హరీష్ రావును టన్నెల్ ఇంజనీరింగ్ గురించి నిపుణుల కంటే ఎక్కువగా ఏమీ తెలుస్తాడా? భారత సైన్యం, నేవీ కమాండోలు, BRO బృందాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నాయి.వారిని అవమానించడానికి హరీశ్ రావు ఎవరు?” అని ఆయన ప్రశ్నించారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ స్టేషన్ పేలుడు ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మరణించినప్పుడు ఒక్క బీఆర్ఎస్ నేత కూడా అక్కడికి వెళ్లలేదని ఆయన గుర్తుచేశారు.నాడు రెవంత్ రెడ్డి బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు, అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన విషయాన్ని ఎందుకు దాచి పెడుతున్నారన్నారు. అదే విధంగా దేవాదుల ప్రాజెక్ట్‌లో ఏడుగురు కార్మికులు మరణించిన ఘటనలో వారి శవాలను ఐదేళ్ల తర్వాత మాత్రమే వెలికితీసినట్లు ఆయన వివరించారు. “ఆ సమయంలో హరీశ్ రావు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మాత్రం SLBC ప్రమాదంపై రాజకీయ హంగామా చేస్తున్నారు” అని ఆయన విమర్శించారు.
“SLBC, దేవాదుల, సీతారామ, పలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా వదిలేశారన్నారు. ఇప్పుడు మాత్రం తెరవెనుక నీటిపై చింతిస్తున్నట్లు నటిస్తున్నారు” అని అన్నారు. ప్రమాద ఘటనలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని బినియోగిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు
ఆర్మీ,నేవీ లాంటి మొత్తం11 సంస్థలకు చెందిన బలగాలు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నతన్నారు ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన టన్నెల్ ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.11 అగ్రశ్రేణి సంస్థలను రంగంలోకి దింపి ఆపరేషన్‌ను సమన్వయంతో నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.
రక్షణ బృందాలు నిరంతరాయంగా పని చేస్తూ, అత్యాధునిక టెక్నాలజీతో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామనిఆయన తెలిపారు. ప్లాస్మా కట్టర్లు, హై-గ్రేడ్ షట్టర్లు, డెబ్రిస్ తొలగింపు యంత్రాలు ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
“ఈ ఆపరేషన్ అత్యంత సవాళ్లతో కూడుకున్నది. దేశంలోని అత్యుత్తమ నిపుణులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దీన్ని విజయవంతం చేయడానికి శ్రమిస్తున్నారు” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.మరో రెండు మూడు రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారుఅంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో టన్నెల్ బోర్ మిషన్లు,డి-వాటరింగ్ పునరుద్ధరణ ప్రక్రియ కొన సాగుతుందన్నారుమరో రెండు మూడు నెలల్లో ఎస్.ఎల్.బి.సి పనులను పునరుద్దరిస్తామని ఆయన ప్రకటించారు