TG Polling | ఉత్సాహంతో ఓటర్లు..
TG Polling, జనగామ, ఆంధ్రప్రభ : స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో సర్పంచ్ ఎన్నికలు గురువారం ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని చిల్పూర్, స్టేషన్గన్పూర్, రఘునాథపల్లి, జాఫర్గడ్, లింగాల గణపురం మండలాల్లో ఉదయం చలి ఉన్నప్పటికీ ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉత్సాహంగాను పాల్గొంటున్నారు.

