TG | విష అల్పాహారం – 30 మంది విద్యార్థులకు అస్వస్థత

కౌడిపల్లి ఏప్రిల్ 13 మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల హాస్టల్ లో ఆదివారం రోజున అల్పాహారం తిన్న తర్వాత 30 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు వివరాల్లోకెళ్తే ఆదివారం రోజున ఉదయం విద్యార్థులకు ఇవ్వాల్సిన రాగి జావ ఇవ్వలేదు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఇడ్లీలు అల్పాహారంగా ఇవ్వడంతో ఇడ్లీలు తిన్న విద్యార్థులు దాదాపు 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు

విద్యార్థులకు కడుపునొప్పి వాంతు లతొ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులు వెల్లగా హాస్పిటల్లో ఉన్న డాక్టరు సిబ్బంది చికిత్స చేశారు

ఈ సందర్భంగా పలు విద్యార్థులు మాట్లాడుతూ ఇడ్లీ పాయిజన్ కావడం వల్లనే మాకు వాంతులు కడుపునొప్పి రావడం జరిగిందన్నారు ఇంతే కాకుండా హాస్టల్లో విపరీతమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని బోరున ఏడ్చారు

హాస్టల్లో ఫ్యాన్లు లేవని పలుమార్లు వార్డెన్ నరసమ్మకు వివరించినప్పటికీ స్పందించలేదన్నారు అన్నంలో కూడా వెంట్రుకలు వస్తాయని ఆహారం తినలేని పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు వారి గోడును తెలియజేశారు వార్డెన్ నర్సమ్మను వివరణ కోరగా వాంతులు కడుపునొప్పి రావడం వాస్తవమేనని కొంతమంది విద్యార్థులకే వచ్చిందని ఇడ్లీలో పులుపు ఎక్కువ కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు

విద్యార్థులను వెంటనే హాస్పిటల్కు పంపించి చికిత్స చేయించడం జరిగిందన్నారు పిల్లల తల్లి తండ్రులు హాస్టల్ కు వచ్చి ఎప్పుడు హాస్టల్లో సమస్యలు ఉంటాయని తల్లిదండ్రులు తెలియజేశారు ఉన్నతాధికారులు స్పందించి పిల్లలకు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *