హైదరాబాద్ – శాసనసభ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని మండి పడ్డారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి .. నేడు ఆయన శాసనసభకు వచ్చారు.. అయితే సభలోకి వెళ్లకుండామార్షల్స్ అడ్డుకున్నారు.. ఈ సందర్బంగా తనను సస్సెండ్ చేసినట్లు స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వును చూపించవలసిందిగా మార్షల్స్ ను కోరారు.. లేదంటే తానే నేరుగా స్పీకర్ కు కలుస్తానని అన్నారు.. అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ఇప్పటి వరకు సస్పెండ్ పై బులెటిన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. తనను రావొద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బులెటిన్ ఇస్తే నేను రాను.. ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేసారో అర్థం కావడం లేదు.. వారం నుంచి తనకు బులెటిన్ విడుదల చేయలేదు అని తెలిపారు. ఇక, ఇష్టారాజ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. పద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదు.. రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుంది అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు
దావత్‌కు కూడా హెలికాప్టర్ వినియోగం
సూర్యాపేట : మాజీ మంత్రి జానారెడ్డి దావత్ కు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు హెలికాప్టర్ లో తిరుగుతున్నారని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. గంట ప్రయాణం కు కూడా హెలికాప్టర్ లో వెళుతూ ప్రభుత్వ సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. పవర్ ప్లాంట్ లో ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి రాత్రి 10.15 నిమిషాలకు జరిగితే 10.35కు చేరుకున్నట్లు గుర్తుచేశారు. సహాయక చర్యల్లో పాల్గొని, చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు వారికి ఉద్యోగాలు కూడా కల్పించామన్నారు. ఎస్ఎల్బిసీ లో జరిగిన ప్రమాదంలో కాంగ్రెస్ మంత్రుల దుర్మార్గపు చర్యల వల్ల చనిపోయిన కుటుంబాలు ఎంత బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని బయటకు తెచ్చే వరకు అక్కడే ఉంటామని చెప్పి అటువైపు కన్నెత్తి చూడటం లేదన్నారు.