హైదరాబాద్, (ఆంధ్రప్రభ): రాష్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా వ్యవస్థలోని కీలక విభాగాల్లో కొంతమంది అధికారులను బదిలీ చేస్తూ, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఐషా మస్రత్ ఖానం ప్రస్తుతం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తాజాగా ఆమెకు సివిల్ సప్లైజ్ శాఖ జాయింట్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, ఇప్పటివరకు ఆ బాధ్యతలు చూసిన ముజమ్మిల్ ఖాన్ (IAS 2017) ను ఆ పదవి నుంచి తప్పించారు.
2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జెండగే హనుమంత్ కొండిబాను టూరిజం డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేసి సివిల్ సప్లైజ్ డైరెక్టర్ గా నియమించారు. దాంతో పాటు జెండగే హనుమంత్ ను హైదరాబాద్‌కి చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతల్లో కూడా నియమించారు. ముజమ్మిల్ ఖాన్‌కి ఆ బాధ్యతల నుంచి విముక్తి ఇచ్చారు.
ముజమ్మిల్ ఖాన్ ఇకపై సాధారణ పరిపాలన (GAD) శాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాల మేరకు గవర్నర్ పేరుతో అధికారికంగా ప్రకటించారు.
