TG Assembly: తుమ్మడిహట్టి ప‌నులు త్వ‌రలోనే ప్రారంభిస్తాం… మంత్రి ఉత్త‌మ్

హైద‌రాబాద్ : గోదావరి నది ప్రాజెక్టులపై మంత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్‌ ను వీలైనంత తొందరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతామని స్పష్టం చేశారు. ఈ విషయంపై వచ్చే నెలలో మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా మాట్లాడుతామన్నారు. ఈ ఎండాకాలంలోనే ప్రాజెక్ట్ పనులను ప్రారంభించాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా సీతారామ ప్రాజెక్ట్‌ కు నీటి కేటాయింపులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రానున్న రెండేళ్లలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి నీరందించేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *