కార్మిక ఉద్యోగ‌ నేత కామ్రేడ్ బి టి రణదీవే వర్థంతి సభ.

కార్మిక ఉద్యోగ‌ నేత కామ్రేడ్ బి టి రణదీవే వర్థంతి సభ.

బి టి రణదీవే ఆశయాలకు అనుగుణంగా కార్మిక వర్గం ఐక్య పోరాటాలు నిర్వహించాలి.

ములకలపల్లి, ఆంధ్రప్రభ : కార్మికోద్యామ నేత కామ్రేడ్ బి టి రణదీవే ఆశయాలకు అనుగుణంగా కార్మిక వర్గం శ్రామిక ప్రజానీకం ఐక్యంగా ఉద్యమించాలని సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయం అమరజీవి ఉద్యమా నేత కామ్రేడ్ బి టి రణదీవే వర్థంతి సభ ఘనంగా నిర్వహించి బి టి రణదీవే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సిఐటియు వ్యవస్థాపకులు బిటి రణదీవే కార్మిక సంఘాలు స్థాపించి కార్మికుల ఐక్యంగా సమీకరించి శ్రమ దోపిడీ వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఆనాడు యాజమాన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్యంగా అనేక పోరాటాల ద్వారా చట్టాలు వచ్చియన అన్నారు.

దేశంలో స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులకు హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు ఉదృతంగా నిర్వహించారని అన్నారు. బి టి రణదీవే ఉద్యమ స్పూర్తి తో నేటి కార్మిక వర్గం ఐక్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక,ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, కార్మికులకు తీవ్రంగా అన్యాయం చేస్తుందని మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల ను కార్మిక ఉద్యమాల తో తిప్పి కొట్టాలని అన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వేంటనే ఉపస్వరించుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు గోపగాని లక్ష్మీ నర్సయ్య,సిఐటియు నాయకులు కుంజా నాగమణి,కీసరి శ్రీలత,పపామ్మ,బుచ్చమ్మ,మంగ, తిరుపతమ్మ, కళ్యాణి, చంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply