విధివిధానాలపై అవగాహన కల్పించేందుకే శిక్షణ

విధివిధానాలపై అవగాహన కల్పించేందుకే శిక్షణ
జైనూర్,ఏప్రిల్ 6 (ఆంధ్రప్రభ ): గ్రామ పంచాయతీల నూతన వార్డు సభ్యులకు వారి విధులు విధానాలు పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన కల్పించింది ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జైనూర్ ఎంపీడీవో సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం కొమరం భీ0 ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో వార్డు సభ్యులకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 26 గ్రామపంచాయతీలో నూతనంగా గెలుపొందిన సభ్యులకు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
మొదటి విడత శిక్షణ పూర్తయిందని రెండో విడత శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందని వాడు సభ్యులు ఐదు రోజులపాటు ప్రతిరోజు శిక్షణ తరగతులు పాల్గొని శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ శిక్షణలో టిఓటిలు వార్డు సభ్యులకు వారి విధులు విధానాలు పంచాయతీరాజ్ చట్టాలు గ్రామసభల నిర్వహణ విషయాలు తదితర అంశాలపై శిక్షణ ఇస్తారని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి భు ఖ్య శశికుమార్, సూపర్డెంట్ శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ మోహన్, శిక్షణ నిర్వాహకులు (టి ఓ టి లు ) హరీష్, విలాస్, సంతోష్, ఎండి అజర్ అలీ, గ్రామ పంచాయతీల నూతన వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
