ఏఐ ఉచిత శిక్ష‌ణ‌కు అనూహ్య స్పంద‌న‌..

ఏఐ ఉచిత శిక్ష‌ణ‌కు అనూహ్య స్పంద‌న‌..

గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు…
సదస్సులో పాల్గొన్న విద్యార్థుల
అనుమానాల‌ను నివృత్తి చేసిన నిపుణులు.

కరీమాబాద్ ,ఆంధ్రప్రభ : సత్యం కంప్యూటర్స్ సిఎండిగంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 34 వ డివిజన్ శివనగర్ లోని రామాలయ కళ్యాణ మండపంలో నిర్వ‌హించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై విద్యార్థుల్లో అపోహలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు ఉచిత అవగాహన సదస్సుకు అనూహ్య స్పంద‌న ల‌భించింది. నూతన టెక్నాలజీ అయిన ఏఐ పై జ‌రిగిన స‌దస్సుకు వందలాది మంది విద్యార్థులు,యువ‌త పాల్గొన్నారు.నిరుద్యోగులు కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని అందించాలనే ఉద్దేశంతో ఏఐ కెరీర్స్, కంప్యూటర్ విజన్, ఐటి రోడ్ మ్యాప్, కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సును ఫౌండేషన్ ఉచితంగా నిర్వ‌హించింది.

ఏఐ రంగ నిపుణులు పునిత్ శ‌ర్మ‌, రంజిత్ చిన్న‌ప‌ల్లి, బండి ప్ర‌వీన్‌కుమార్‌లు ఏఐ రంగంలో వ‌స్తున్న మార్పులు, అవ‌కాశాల‌ను వివ‌రించారు. ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తుండ‌గా, తాజాగా సాంకేతిక‌పై నైపుణ్యం క‌ల్పించేందుకు ఈ స‌ద‌స్సులు నిర్వ‌హించినట్టు పేర్కొంది. వరంగల్ యువతకు, విద్యార్థుల కోసం కంప్యూటర్ విద్యను అందిస్తున్న గంట రవికుమార్ వస్తున్న నూతన టెక్నాలజీని సైతం ఇక్కడి యువత విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా, ఏఐ టెక్నాలజీని అందించి విద్యార్థుల నైపుణ్యానికి దోహదపడాలనే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించి రానున్న రోజులలో ఉద్యోగ అవకాశాల్లో కూడా మెరుగైన ప్రదర్శన, విద్యార్థులు అందించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ గంట రవికుమార్, ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply