వేసవిలో దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వేసవిలో దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : వేసవికాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ తెలిపారు. మండలంలోని పీపల్ పహాడ్ తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ మాట్లాడుతూ
చౌటుప్పల్ పట్టణం, గ్రామాలలో ప్రజలు వేసవి కాలంలో చాలా మంది వారి ఇంటి డాబాలపైన, ఆరుబయట వరండాలలో కుటుంబ సమేతంగా నిద్రించుచున్నారు. అట్టి సమయములో చాలా మంది ఇంటికి తాళాలు వేయకుండా డోర్ లు దగ్గరికి వేసి నిద్రిస్తున్నారు, ఇదే ఆదునుగా భావించి దొంగలు ఇండ్లలోకి ప్రవేశించి విలువైన బంగారం, వెండి విలువైన వస్తువులు, నగదును దొంగతనముగా దోచుకుని వెళుతున్నారు,
కొందరు పండుకొని ఉండగా వారి మెడలో నుండి బంగారు పూస్తేల త్రాడు, ఇతర విలువైన వస్తువూలు దోచుకుని వెళుతున్నారు. అదేవిధంగా శుభకార్యాల నిమిత్తం పొరుగు గ్రామాలకు, బందువుల ఇంటికి వెళ్ళువారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే ప్రతి ఒక్కరూ వారి స్తోమతకు తగ్గ సీసీ కేమరాలు అమార్చుకోవాలన్నారు. గ్రామాలలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహించవద్దని, ఎవరేని బెల్ట్ షాపులు నడిపిన, అనుమానాస్పద వ్యక్తులు మీకు కనిపించినచో వెంటనే 100కు డయల్ చేసి పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, అదే మాదిరిగా ప్రతి గ్రామములో, పట్టణంలోని కాలనివాసులు తప్పకుండ కేమరాలు అమార్చుకోవాలి. వీరితో పాటు చిన్నపాటి షాప్ ల నుండి పెద్ద పెద్ద షాప్ ల వరకు అన్నీ కంపనీల వారు తప్పనిసరిగా కెమరాలు అమర్చుకోవాలి, అవి పని చేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.
