శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్
రెంజల్, ఆంధ్రప్రభ : మండలంలోని బోర్గాం గ్రామంలో శనిగ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ మల్కు జ్యోతి యాదవ్ సోమవారం ప్రారంభించారు.ఇన్చార్జి తహాసిల్దార్ శ్రావణ్ కుమార్,పిఐసి ఎన్.అశోక్ కుమార్ లతో కలిసి ఆమె కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేశారు.రాష్ట్ర మార్క్ పేడ్ ఎన్సిసిఎఫ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధర రూ.5875 క్వింటాలకు ప్రకటించిందన్నారు.నాణ్యత ప్రమాణాల ఆధారంగా ఎండబెట్టి,పూర్తిగా శుభ్రపరిచి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్దకు తెచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న ధరను పొందాలన్నారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబిన్ ఖాన్,తాజా మాజీ చైర్మన్ మొహినోద్దీన్,బోధన్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కార్తిక యాదవ్,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎల్ రాజు,ఉప సర్పంచ్ పాషా పటేల్,కార్యదర్శి ఇంద్రసేన్,ఏఈఓ అజయ్, ఊబేద్ అలీ,బోగిడి రవి,ఆసాని అనిల్,నరేందర్,నీరడి గంగాధర్, ఖదీర్ పటేల్,గవాస్కర్,రైతులు పాల్గొన్నారు.
