TG | ఇప్పగూడెం శివారులో..!

TG | ఇప్పగూడెం శివారులో..!
ప్రాణాలకు ముప్పుగా మారిన ట్రాన్స్‌ఫార్మర్
దాసుకుంట వద్ద చెట్ల మధ్య దాగి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తో ఎప్పుడైనా ప్రమాదం జరగొచ్చు
విద్యుత్ శాఖ అధికారులకు ప్రజల ప్రాణాలపై నిర్లక్ష్యమెందుకు..?
పెద్ద ప్రమాదం జరగకముందే స్పందించాలని గ్రామస్తుల డిమాండ్
TG | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడెం శివారులో దాసు కుంట చివర ప్రాంతంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారింది. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ చెట్ల పొదలు విస్తరించి పూర్తిగా కప్పేసిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ ఉందో కూడా స్పష్టంగా కనిపించని ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఎప్పుడైనా ప్రమాదానికి దారితీసేలా భయానకంగా మారింది. ప్రత్యేకం గా పంట పొలాలకు వెళ్లే రైతులు ఈ మార్గాన్ని ద్వారా వెళ్లాల్సి ఉండ డంతో చెట్ల మధ్య దాగి ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వల్ల ప్రమాదం పొంచి ఉంద ని వారు చెబుతున్నారు. అయితే చెట్ల మధ్య దాగి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్
కనిపించకపోవడంతో ఎప్పుడైనా అనుకోకుండా తాకే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణాలను తీస్తుందనే పరిస్థితి నెలకొంది.

ప్రజల ప్రాణాల విషయంలో విద్యుత్ అధికారులకు ఎందుకు నిర్లక్ష్యం..?
ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే..పశువులు మేత కోసం వెళ్లే సమయంలో ఈ ట్రాన్స్‌ఫార్మర్‌కు దగ్గరగా చేరే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసు కు న్నాయని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటి ప్రమా దం సంభవించే అవకాశముందని భయపడుతున్నారు. అయితే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బిల్లులు వసూలు చేయడంలో చురుకుదనం చూపించే అధికారులు…ప్రజల ప్రాణాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో గ్రామస్తులు ప్రశ్నిస్తున్నా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పెరిగిన చెట్ల పొదలను వెంటనే తొలగించి, భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామ స్తులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగే ముందు చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.
