బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి,(స్వామి) అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్ల సౌకర్యంతో కల నెరవేరడంతో అభినందనీయం భీమ్‌గల్ పట్టణంలోని బుధవారం 8,వ వార్డ్ లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే. నాగమణి (స్వామి) హాజరై వార్డ్ కౌన్సిలర్ మామరి సందీప్ స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సంటి లత (నర్సయ్య) యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేపల్లి నాగేంద్రబాబు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మొండి దినేష్,మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ సంతోష్, 8వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
