న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు పట్ల హర్షం

న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు పట్ల హర్షం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టానికి ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిఠాయిలను పంపిణీ చేశారు. చట్టాన్ని తీసుకువచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకటా చలపతి, ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, ఎలమోని శ్రీనివాస్, ఊడుగు శ్రీనివాస్, పిట్టల బిక్షమయ్య, తడక మోహన్, జెల్ల రమేష్, తాడూరి పరమేష్, రిక్కల సుధాకర్ రెడ్డి, ఖయ్యుమ్, శ్రీకాంత్, శ్రీశైలం, విజయ్, భరత్, నాగరాజు, నర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.
