గ్రామస్తుల ఆవేదన..

గ్రామస్తుల ఆవేదన..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డు కొత్రేపల్లి లో ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ కూలిపోయీ ఇబ్బందికరంగా మారింది. గ్రామస్తులు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించి బాగు చేయించాలని కోరుతున్నారు. కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణ గల ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలని అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రాథమిక పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేని కారణంగా పాఠశాల ఆవరణలోకి పశువులు ద్విచక్ర వాహనాలు ఇతరులు ప్రవేశించే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
