అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి..

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నాయకులతో కలిసి అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 21న అంబేద్కర్ జీవిత చరిత్ర పై నాటిక కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమని నిర్వాహకులకు ప్రశంసించారు.

అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే నిర్వాహకులకు కోరారు. ఈ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శిదాసండ్లప్రభాకర్, అదిలాబాద్ జిల్లా డిసిసి ఉపాధ్యక్షులులింగంపల్లి చంద్రయ్య, అదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, ఉట్నూర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులుసుభాష్ బొంకంటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలం, కొత్తపల్లి మహేందర్, మర్సకోల తిరుపతి, అచ్చ దేవానందం,వెంకటేష్, సంజీవ్, కొల్లూరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply