స్థానికులను పలకరించిన మంత్రి అడ్లూరి..

స్థానికులను పలకరించిన మంత్రి అడ్లూరి..
అక్క.. అన్న ఏట్లా ఉన్నరు..
సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు
గొల్లపల్లి, జగిత్యాల, ఆంధ్ర ప్రభ : ఎండాకాలంలో సూర్య తాపానికి చెట్ల నీడన కూర్చొని సేద తీరుతున్నారు గ్రామస్తులు.. ఆదివారం చెట్ల కింద సేద తీరుతున్న వారిని చూసి అటుగా వెళుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాహన శ్రేణి ఒక్కసారిగా నిలిచిపోయింది. వాహనంలో నుంచి దిగిన మంత్రి అడ్లూరి అక్క ఎట్లున్నవ్. అన్న ఎట్లున్నవే. అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అపాయ్యంగా పలకరించారు. మంత్రిని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు మంత్రి సామాన్యులను చూసి వాహనం నిలిపి మంత్రి మందలించడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే సాక్షాత్తు మంత్రి తమ కళ్ళ ముందు కనిపించడంతో తమ వార్డు సమస్యలను మంత్రికి వివరించారు. వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం తో పాటు కరెంటు పోల్స్ కావాలని మంత్రికి వివరించారు. వార్డు సమస్యలపై స్పందించిన మంత్రి వెంటనే నిధులు మంజూరు చేసి సీసీ రోడ్డు నిర్మాణం, నూతన కరెంటు పోల్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
