అమెరికాలో మెడికల్ సీటు సాధించిన విద్యాకుసుమం..

అమెరికాలో మెడికల్ సీటు సాధించిన విద్యాకుసుమం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన విద్యాకుసుమం అమెరికాలోని జార్జియా మెడికల్ పిజి సీటు సాధించి పలువురిచేత శభాష్ అనిపించుకుంటుంది. ఊట్కూర్ మండలపరిధిలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన డాక్టర్ కౌండిన్య శ్రీజ గౌడ్ అమెరికాలోని జార్జియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రాజశేఖర్ గౌడ్ ఉపాధ్యాయుడు,పద్మావతి మాట్లాడుతూ శ్రీజ చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థిని అని వైద్య విద్య ఎం.బి.బి ఎస్ ను హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో పూర్తి చేసిందని ఉన్నత విద్యకై 2025 డిసెంబర్ లో యునైటెడ్ స్టేట్స్ ఎమిలి స్టెప్ టు ఎంట్రెన్స్ రాయగా 300 మార్కులకు గాను 252 మార్కులు సాధించి అమెరికాలోని జార్జియాలో గల ప్రతిష్టాత్మక దక్షిణ ప్రాంతీయ వైద్య కేంద్రమైన ప్రైమ్ సౌత్ కన్సార్టియం రివర్టేల్ లో ఇంటర్నల్ మెడికల్ పీజీ సీటు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అనంతరం పెదనాన్న,పెద్దమ్మ రాజు గౌడ్,యమునలు మాట్లాడుతూ మట్టిలో మాణిక్యం లాగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి అమెరికాలోని ప్రతిష్టాత్మక కాలేజీలో పిజి మెడికల్ సీటు సాధించడం చాలా సంతోషం అన్నారు. విద్యార్థిని అమెరికాలో మెడికల్ పిజి సీటు సాధించడంతో సర్పంచ్ రాములు, మాజీ ఎంపీటీసీ కృష్ణార్జున్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
