రాజుపేట వద్ద కారు బోల్తా..

రాజుపేట వద్ద కారు బోల్తా..
ఏటూరునాగారం, మంగపేట, ఆంధ్రప్రభ : మంగపేట మండలంలోని రాజుపేట సమీప కప్ప వాగు మలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసి ప్రాథమిక సహాయం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
