పోలీసులకు ఆరోగ్య శిబిరం..

పోలీసులకు ఆరోగ్య శిబిరం..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సమన్వయంతో పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు పోలీసు సిబ్బందికి రక్తపోటు, షుగర్, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సూచనలు ఇచ్చారు. పోలీసు విధుల్లో తరచుగా ఎదురయ్యే ఒత్తిడి మరియు అనియమిత పనివేళల కారణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని వైద్యులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరం ద్వారా పోలీసు సిబ్బంది తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply