గ్రామపంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్..

గ్రామపంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : చలో హైదరాబాద్ ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న గ్రామపంచాయతీ సిబ్బందినీ మంగళవారం పోలీసుల ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో నిర్వహించనున్న “చలో హైదరాబాద్” ధర్నాకు వెళ్లేందుకు సిబ్బంది సమీకరిస్తుండగా, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామపంచాయతీ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.

Leave a Reply