వృద్ధురాలికి నిత్యవసర సరుకులు అందచేత..

వృద్ధురాలికి నిత్యవసర సరుకులు అందచేత..

వృద్ధురాలికి విష్ణు సహస్రనామ పారాయణం గ్రూప్ చేయూత

కరీమాబాద్, ఆంధ్రప్రభ : నిరుపేద వృద్ధురాలికి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం గ్రూపు నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ లోని లేబర్ కాలనీలో అద్దె ఇంట్లో జీవనం గడుపుతున్న 70 సంవత్సరాలు దాటిన సుశీలమ్మ అమ్మను పోషించుకునే సమయంలో కొడుకుకు పక్షవాతం వచ్చి మంచంలో పడ్డాడు ఆ తల్లి సుశీలమ్మ ఏదో ఒక పని చేస్తూ కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తినడానికి నిత్యావసర దినుసులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని విష్ణు సహస్రనామ పారాయణ గ్రూప్ వ్యవస్థాపకులు గర్రెపల్లి సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు.

మానవ సేవే మాధవ సేవ అనేలా గ్రూపు తరఫున ఎవరికి తోచిన సాయం వారు అందజేస్తే ఆ వచ్చిన డబ్బులతో ఒక నెల రోజులకు సరిపోను నిత్యావసర సరుకులను గోశాలలో విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం సుశీలమ్మ కు నిత్యవసర సరుకులు అందజేసినారు. కార్యక్రమంలో పూజారి లక్ష్మణస్వామి గోపిశెట్టి బుచ్చన్న అయితా రవీందర్ ఉమాదేవి దివ్వెల పూర్ణచందర్ రాధిక గర్నెపెల్లి మాధవి శార్వాణి రామేశ్వరం కొంకాల వెంకటేశ్వర్లు మారం రామాంజనేయులు మాధవి ఆర్ వెంకటేశ్వర్లు చిట్టిమల్ల విజయ్ కుమార్ పాల్గొన్నారు

Leave a Reply