గ్రామాభివృద్ధికి మౌలిక వసతులే బలమైన పునాది..

గ్రామాభివృద్ధికి మౌలిక వసతులే బలమైన పునాది..

తానేదార్ పల్లిలో రూ.25 లక్షల సిసి రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బెలీదె వెంకన్న

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ: గ్రామాభివృద్ధికి మౌలిక వసతుల బలమైన పునాది అని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బెలీదె వెంకన్న అన్నారు. ఆదివారం స్టేషన్ ఘన్ పూ ర్ మండలం తానేదార్ పల్లి గ్రామంలో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పను లను సర్పంచ్ హరిత ఇంద్రసేనా రెడ్డితో కలిసి ముఖ్యఅతిధిగా హాజరై నా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బెలీదె వెంకన్న ప్రారంభించారు. ఎన్ ఆర్ఈజిఎస్, ఎస్డిఎఫ్ నిధుల ద్వారా సుమారు రూ.25 లక్షల వ్యయం తో గ్రామంలోని ఐదు ప్రాంతాల్లో సిసి రోడ్లను నిర్మించేందుకు నిర్ణయిం చారు.అనంతరం బెలిదే వెంకన్న మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లు, పారి శుధ్యం, తాగునీరు వంటి సదుపాయాలు మెరుగుపడితేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.

గ్రామ ప్రజలకు ఉపయో గపడే అభివృద్ధి కార్యక్రమాలు మరింత కొనసాగాలని ఆయన ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాదె శాంత, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, నాయకులు ఎన్ రెడ్డి లింగారెడ్డి, చుక్క రమే ష్, ఎండి అక్బర్ పాషా, దుంపల పద్మా రెడ్డి, మంతెన మౌనిక, ఆకుల కృష్ణంరాజు, మేకల రజిత, గాదె భాస్కర్, మంతెన హరీష్, గుండె రంజి త్, ఆకుల చంద్రమౌళి, మేకల ప్రవీణ్, ఎండి కాసిం, నరసయ్య, చంద్ర య్య, గాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply