పంచాయతీ సిబ్బంది సేవలు ఆదర్శం..

పంచాయతీ సిబ్బంది సేవలు ఆదర్శం..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శమని మండలంలోని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి, ఉపసర్పంచ్ కార్తీక్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బందిని సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ సిబ్బంది తినలేని సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమస్య ఉన్న తక్షణమే స్పందిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని వారు చెప్పారు. పంచాయతీ సిబ్బందిని ప్రతి ఒక్కరూ గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ గౌడ్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
