గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా..

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని మంగళవారం బాబాపూర్, పురాణిపేట్, గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ఐదో రోజు మంగళవారం మురికి కాల్వలో బ్లీచింగ్ చేసే విధానాన్ని ఎంపీడీవో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని స్థానిక పంచాయతీలకు సూచించారు.అలాగే గ్రామాలలో పల్లె ప్రకృతి వనం గ్రామంలో మొక్కలు నీరు పోసి సంరక్షణ చర్యలు చేపట్టే బాధ్యత పంచాయతీ సెక్రెటరీ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సయ్యద్ జావీద్ అలీ, బాబా పూర్ సర్పంచ్ ఎంఏ సమీర్, పురాణిపేట్ సర్పంచ్ బుర్ర సుమ దేవేందర్ గౌడ్, ఉప సర్పంచ్ మంద గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శిలు జితేందర్, ప్రశాంత్, నాయకులు సలీం,అజార్, చిన్నారెడ్డి, రాడే మురళి, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

