తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహన..

తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహన..
ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్,
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రజాపణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రిన్సిపల్ సెక్రటరీ, సంచాలకులు పురపాలక పరిపాలన శాఖ ఆదేశాల మేరకు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఆదివారం పట్టణంలోని వివిధ వార్డులలో తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బోదిరే నాగమణి స్వామి హాజరై ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ..తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి ఇవ్వాలన్నారు. చెత్తను తప్పనిసరిగా మున్సిపల్ వాహనానికి అందించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివిధ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సంటి లత (నర్సయ్య) వివిధ వార్డ్ కౌన్సిలర్లు, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్. మెప్మా సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది,వార్డ్ ప్రజల తరతరాలు పాల్గొన్నారు.
