TG | మానవత్వం చాటుకున్న వెదిరె బ్రదర్స్

TG | మానవత్వం చాటుకున్న వెదిరె బ్రదర్స్

TG | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు పార్వతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి సహకారంతో ఫౌండేషన్ వైస్ చైర్మన్,ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి పార్వతమ్మ కుటుంబాన్ని పరామర్శించి, బాధిత కుటుంబానికి రూ.10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వెదిరె విజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆపద సమయంలో సహాయ హస్తం అందించడం ఫౌండేషన్ లక్ష్యమని భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి అండగా నిలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొంపల్లి సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, జీడిమడ్ల ఇందిరమ్మ, జీడిమడ్ల మౌనిక, బోయపర్తి ప్రసాద్, జాల నర్సింహ, యాదగిరి రెడ్డి, జీడిమడ్ల వెంకటయ్య, బోయపర్తి లింగయ్య, సంకు శంకర్, మొగుదాల శివ, బోయపర్తి గణేష్, మొగుదాల శంభు గౌడ్, జీడిమడ్ల శంకర్, వడ్డేపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply