TG | ఓటేసి అభివృద్ధిని స్వాగతించాలి…

TG | ఓటేసి అభివృద్ధిని స్వాగతించాలి…

  • 30వ వార్డులో ముమ్మర ప్రచారం

TG | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ 30వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.మనీష ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం బాలాజీ నగర్, ఎంప్లాయిస్ కాలనీ, అయ్యప్ప కాలనీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు ఓటు వేసి అభివృద్ధిని స్వాగతించాలని, చెయ్యి గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకటరాజుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply