TG | నన్ను గెలిపించేది మీరే.. అభివృద్ధి చేసేది నేనే

TG | నన్ను గెలిపించేది మీరే.. అభివృద్ధి చేసేది నేనే
- 13వ వార్డులో సేవే లక్ష్యంగా యువనేత పోటీ
- మౌలిక వసతుల శాశ్వత పరిష్కారమే లక్ష్యం
- 13వ వార్డులో దూసుకపోతున్న రాడపాక ఆరోగ్యం ఎన్నికల ప్రచారం
TG | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో రాడపాక ఆరోగ్యం ఎన్నికల బరిలో నిలిచారు. యువనేతగా, సేవా దృక్పథం కలిగిన వ్యక్తి గా ఆయనకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్నప్పటి నుంచే అనేక కష్టాలను ఎదుర్కొంటూ, సామాన్యుడి జీవితాన్ని దగ్గరగా చూసి, అదే స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అతను. అందుకే వార్డు ప్రజల సమస్యలు, అవసరాలు ఆయనకు మాటలకే కాదు…అనుభవంతో తెలిసివేనని ప్రజలు పేర్కొంటున్నారు.

ఆదివారం వార్డులో నిర్వహించిన ప్రచారంలో ఆరోగ్యం దూసుకపోతున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. వార్డులో మౌలిక సదుపాయాల అభి వృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్య మని తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడ కుండా అవగా హన కల్పించడం, వారికి సరైన దిశానిర్దేశం చేయడం, విద్యా, ఉపాధి అవకాశాలపై మార్గనిర్దేశం చేయాలనే స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగినట్లు చెప్పారు. అదే విధంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా, నిజమైన అర్హులకు చేరేలా చూస్తా నని హామీ ఇచ్చారు.

మహిళల భద్రత, ఆరోగ్యం, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, వృద్ధు లు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందిస్తా నన్నారు. వార్డులో పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పారిశుధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. నన్ను గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ఈ సందర్బంగా కోరారు.
