Temple | కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Temple | కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Temple | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం ఇవాళ భక్తులతో కిటకిటలాడింది. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో అంజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు క్యూ లైన్ల‌లో బారులు తీరారు.

భక్తుల రద్దీతో ఘాట్‌ రోడ్డుపై వాహనాలు కాసేపు నిలిచిపోయాయి. ఆలయంలో ఏర్పాట్లను ఈవో శ్రీకాంతరావు పరిశీలించారు. భక్తుల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు.

Leave a Reply