Temple | కన్నుల పండువుగా..

Temple | కన్నుల పండువుగా..

Temple | కొత్తూరు, ఆంధ్రప్రభ : మండల కేంద్రం కొత్తూరులో వెలసి ఉన్న శ్రీ వర ప్రద వెంకటేశ్వర స్వామి(Sri Vara Prada Venkateswara Swamy) ఆలయంలో కన్నుల పండువుగా ముక్కోటి ఏకాదశి పూజలు మంగళవారం వేకువజాము నుండే ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి వెంకట కృష్ణమాచార్యులు వేద మంత్రోచ్చరణలతో స్వామి వారికి ధనుర్మాస అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకు ముందు స్వామి వారినే కొత్తూరు పుర వీధుల్లో ఈ రోజు వేకువజామునే తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ తిరువీధి ఉత్సవ వేడుకల్లో మహిళా భక్తులు దీపాలతో స్వామి వారి వెంట స్థానిక పురవీధు(local temple)ల్లో ఊరేగింపుగా వెళ్తూ గోవిందనామ స్మరణ చేశారు.

Temple |

దీనితో కొత్తూరు గ్రామం అంతా గోవిందనామస్మరణ తో మార్మ్రోగి పోయింది. తిరువీధి ఉత్సవం అనంతరం స్వామికి ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కలిగించారు. ఈ సందర్బంగా వైకుంఠ ముక్కోటి ఏకాదశ పూజలు నిర్వహించారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్బంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు కొత్తూరు ఎస్ ఐ కె వెంకటేష్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్త్(tight security)ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, టీటీడీ ప్రచార మండలి కమిటీ కన్వీనర్ పొగిరి రవి, సభ్యులు గుడ్ల కృష్ణారావు, లోతుగెడ్డ తాతబాబు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply