Temple | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

Temple | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

అంతరాలయ దర్శనం కొనసాగింపు
భక్తుల సౌకర్యాలపై ఈఓ శీనా నాయక్ ప్రత్యేక పర్యవేక్షణ

Temple | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానంలోని అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కనకదుర్గమ్మ దర్శనార్థం ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చినా రద్దీ నియంత్రణలోనే ఉండటంతో దర్శన ఏర్పాట్లు సజావుగా కొనసాగుతున్నాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్ వేకువజాము నుంచే ఆలయ పరిసరాలు, క్యూ లైన్ల ఏర్పాట్లు, దర్శన వ్యవస్థపై స్వయంగా పర్యవేక్షణ చేపట్టారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేయవద్దని ఈఓ అధికారులను ఆదేశించారు. దీంతో భక్తులు అమ్మవారి అంతరాలయ దర్శనం చేసుకునే అవకాశం లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Temple |

క్యూ లైన్లలో భక్తుల రాకపోకలు క్రమబద్ధంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా ఆగకుండా దర్శనం వేగంగా పూర్తవుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ సిబ్బంది సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, విశ్రాంతి ప్రాంతాలు, క్యూ లైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులు సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం చేసుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు దేవస్థానం వర్గాలు పేర్కొన్నాయి.

Temple |

CLICK HERE TO READ MORE : 15th March 2026 | తిరుమల సమాచారం..

CLICK HERE TO READ MORE :

Leave a Reply