Temple | సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో
పూజలు నిర్వహించిన తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్
Temple | మోపిదేవి, ఆంధ్రప్రభ : ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజీలుతున్న మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ (ఎస్పీ) కొమ్మిశెట్టి ప్రసాదరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మొదటగా నాగు పుట్టలో పాలుపోసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకుతీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని ప్రసాద్ రావు దంపతులకు అందజేశారు.

