39 డిగ్రీల సెల్సియస్ ఎండ నమోదు..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఎండలు అధికంగా ఉండడంతో రోడ్లన్నీ నిర్మాణస్యంగా మారాయి. ఎక్కడలేని విధంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ కారణంగా ప్రజలు బయటకు రావడానికి జంపుతున్నారు. జిల్లాలో అతి శీతల ప్రాంతమైన వికారాబాద్ లోని ఇటువంటి ఎండలు ఉంటే ఇతర ప్రాంతాల్లో ఎటువంటి ఎండలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ ఎండలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
