హైదరాబాద్ : ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పూర్తి చేసింది. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, 7 గురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించనున్న ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తరవాత ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
కాగా ప్రధాన సమాచార కమిషనర్ గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని నియమించినట్లు తెలిసింది. ఇక మరో ఏడుగురిని ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. కమిషనర్లలో సీనియర్ జర్నలిస్టులకు అవకాశం కలిపించారు.
వారిలో పీవీ శ్రీనివాస్ రావు. అయోధ్య రెడ్డి బోరెడ్డి, కప్పర హరిప్రసాద్, పీఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ మొహిసిన్ లు ఉన్నారు. వీరి నియామకాన్ని ఫైనల్ చేస్తూ కాసేపల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.