Telangana | నట్టల నివారణ..

Telangana | నట్టల నివారణ..

Telangana, ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి గ్రామంలో మంగళవారం జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని మండల పశు వైద్యశాఖ అధికారి ప్రమోద్ తెలిపారు. ఇప్పటి వరకు సుమారు ఆరు వేల గొర్రెలు, వెయ్యి మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

నట్టల నివారణ వల్ల జీవాలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు పెరుగుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. వారం రోజుల పాటు అన్ని గ్రామాల్లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ జరుగుతుందని పశువైద్యధికారి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది మహేందర్, సుశాంత్, షఫీ, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply