ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం

మేడిపల్లిలో సిటీ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన


మేడిపల్లి,ఆంధ్రప్రభ : సైబర్ నేరాలను అదుపు చేసేందుకు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానం పోలీసులకు అవసరమని తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి (B.Shivdhar Reddy) అన్నారు. మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ కమిషనరేట్ ప్రారంగణంలో కమిషనర్ జి.సుధీర్ బాబు ఆధ్వర్యంలో (సిటీ ట్రైనింగ్ సెంటర్) ను సోమవారం డీజీపీ ముఖ్య అతిథిగా పాల్గోని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సైబర్ క్రైం, రోడ్డు భద్రత అంశాలపై పలు సూచనలు చేశారు. CTC నిర్మాణానికి దివిస్ లాబొరేటరీస్ సంస్థ 4 కోట్ల నిధులను కేటాయించినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి డిసిపి పద్మజా, ఏసిపి.చక్రపాణి, మేడిపల్లి సిఐ. గొవిందరెడ్డి..రాచకొండ పోలీస్ విభాగాల పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply