Telangana | అసెంబ్లీలో కులగణన సర్వే … కొనసాగుతున్న చర్చ
వివరాలు వెల్లడించిన రేవంత్ రెడ్డి
సర్వేపై కొనసాగుతున్న చర్చ
హైదరాబాద్ – ఆంధ్రప్రభ – వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణను చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీ లో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను సభలో ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలను అధ్యయంన చేశామని అన్నారు.
మొత్తం 75 అశాలను ప్రాతిపదికగా తీసుకుని సర్వే నిర్వహించామని పేర్కొన్నారు. నవంబర్ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే కొనసాగిందని అన్నారు. ఏడాది క్రితం సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, సరిగ్గా ఏడాది తరువాత సర్వే నిర్వహించి నివేదికను అసెంబ్లీ ముందు ఉంచామని గుర్తు చేశారు. రాష్ట్రంలో మొత్తం కోటి 12 లక్షల కుటుంబాల వివరాలు సర్వేలో సేకరించామని అన్నారు. 96.9 శాతం కుటుంబాలు సర్వేలో బాగస్వామ్యం అయ్యాయని వివరించారు. సర్వే ప్రకారం బీసీ జనాభా 46.25 శాతం, ఓసీ జనాభా 17.79 శాతం, ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, బీసీ మైనారిటీలు 10.08 శాతంగా ఉన్నారని ప్రకటించారు.
ఇక ఈ సర్వేపై మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు అధికార పార్టీ తరుపున మాట్లాడారు.. ఇక బిఆర్ ఎస్ పార్టీ తరుపున తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, బిసి సర్వేలో లెక్కలు తప్పుగా ఉన్నాయంటూ ప్రస్తావించారు..