Telangana | కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

Telangana | కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
Telangana | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అంగన్‌వాడీ కేంద్రాల కోసం మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ చేసిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి సీతక్క కీలక చర్యలకు దిగారు. ఈ వ్యవహారంలో తమపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ అధినేత K. Chandrashekar Raoకు లీగల్ నోటీసులు పంపించారు.
బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్‌దే బాధ్యత అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 48 గంటలలోపు సోషల్ మీడియాలో ఉన్న పోస్టులను తొలగించి, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి సీతక్క హెచ్చరించారు.
