ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మంథని, ఆంధ్రప్రభ : టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మంథని మున్సిపల్ పరిధిలోని దివంగనేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి మంథని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ అందే భాస్కరాచారి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా, పేదలకు భరోసాగా నందమూరి తారక రామారావు తెదేపా పార్టీని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రపంచంలో తెలుగువారి కీర్తిని కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెదేపా పార్టీ ముందుకెళ్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంథని మండల పార్టీ అధ్యక్షులు మాదారబోయిన ఓదెలు యాదవ్, తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బడుగు మహేష్, కమాన్ పూర్ మండల పార్టీ అధ్యక్షులు కీర్తి సత్యనారాయణ, రామగిరి మండల పార్టీ అధ్యక్షులు కంటిపూడి రామకృష్ణ, కాటారం మండల పార్టీ అధ్యక్షులు చీర్ల మల్లారెడ్డి, మంథని ముత్తారం అధ్యక్షులు ఎండి రాజ్ మహమ్మద్, మహాదేవపూర్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నాగుల ధర్మయ్య, మహముత్తారం మండల యూత్ అధ్యక్షులు జాటోత్ మహేష్ నాయక్, సీనియర్ నాయకుడు మాచిడి సమ్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
